13-05-2025 12:27:15 AM
భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం, మే 12 (విజయ క్రాంతి) నిరుపేదలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉండి, ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ద్వా రా తగిన సహాయం అందజేస్తున్నామని రా ష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివా స రెడ్డి అన్నారు.
సోమవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, పాలేరు, కోసుమంచి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను అందజేసారు. తిరుమలాయపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని 64 మందికి కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు రూ 1 లక్ష,116 చొప్పున చెక్కులను, 57 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు మొత్తం రూ18. 65 లక్షల విలువ గల చెక్కులను మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు అండ గా ఉండేందుకు చిత్తశుద్ధితో ప్రభుత్వం పని చేస్తుందని, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా పేదల కష్టాలలో పాలు పంచుకోవా లని కళ్యాణలక్ష్మితో పాటు, ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేసిందని, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ క్రింద గడచిన సంవత్సర కాలంలో రూ 1056 కోట్లు విడుదల చేసిందన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.
మే నెలాఖరు వరకు అర్హులకు రేషన్ కార్డు లు పంపిణీ కార్యక్రమం చేపడతామని, నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 4 వేల మందికి చేయూత నిచ్చి రాష్ట్ర వ్యా ప్తంగా రూ 6 వేల కోట్లు ఖర్చు చేసి సబ్సిడీ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం గోపాయిగూడెంలో ఎస్.డి.ఎఫ్. నిధులు రూ 13.50 లక్షలతో నిర్మించనున్న మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గది నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు.
ధాన్య కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి, కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దని, తరుగు పేరిట కటింగ్ చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మేడిదపల్లి గ్రామం ఎస్.సి. కాలనీలో రూ 16 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు, తిమ్మక్కపేటలో రూ 35 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు, ఎర్రగడ్డ ఎస్.సి. కాలనీలో రూ 30 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్రనీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ ము వ్వా విజయ బాబు, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఖమ్మం ఆర్డీవో జి. నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యే క అధికారి రమేష్, ఏడిఏ సరిత, తిరుమలాయపాలెం ఎంపిడివో ఎస్ కె. సిలార్ సాహె బ్, ఇంచార్జ్ తహసీల్దార్ సుధీర్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరు లు పాల్గొన్నారు.