calender_icon.png 13 May, 2025 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ జీసీసీ హబ్

13-05-2025 01:04:59 AM

  1. సాఫ్ట్‌వేర్, లైఫ్‌సైన్సెస్ సహా అనేక రంగాల్లో అద్భుత అవకాశం 
  2. నగరంలో దిగ్గజ కంపెనీల క్యాంపస్‌ల విస్తరణ
  3. దేశవిదేశీ పెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానం
  4. తెలంగాణ రైజింగ్‌తో ఆర్థికాభివృద్ధి 
  5. ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఎదగడంలో సహకరించాలి 
  6. సొనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
  7. తెలంగాణను ఏఐ లీడర్‌గా మార్చుతాం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): హైదరాబాద్ సాఫ్ట్‌వేర్, లైఫ్‌సైన్సెస్‌తోపాటు అనేక రంగాల్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)లకు హబ్‌గా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నానక్‌రాంగూడలో సొనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ నూతన ఫెసిలిటీ సెంటర్‌ను సోమవారం సీఎం ప్రారంభించారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడు తూ.. సొనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ నూతన ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించుకున్న సందర్భంగా ఉద్యోగులు, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. సొనాటా సాఫ్ట్‌వేర్ అత్యాధునిక ఏఐని ఉపయోగించి పర్యావరణ వ్యవస్థలను రూపొందిం చడం గర్వకారణమని పేర్కొన్నారు

. ఏఐ డాటా సెంటర్లు, తయారీ రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని చెప్పా రు. మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో వంటి ఐటీ దిగ్గజాలు తమ క్యాంపస్‌లను విస్తరిస్తున్నాయని గుర్తు     చేశారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం పనిచేస్తూనే పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం ద్వారా ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని వివరించారు.

పెట్టుబడుల ఆకర్షణలో నంబర్ వన్

డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి కొత్తగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షకుపైగా ఉద్యోగాలు సృష్టించామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 2025లో దావోస్‌లో తెలంగాణ రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని గుర్తుచేశారు. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు.

రాష్ట్రం పోలీసింగ్, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణ నిర్వహణ, ఉద్యోగాల సృష్టి, పన్ను వసూళ్లలో నంబర్ వన్‌గా ఉందని తెలిపారు. 66 లక్షల మంది మహిళలకు స్వయం సహాయక బృందాల ద్వారా సాధికారత, రాజీవ్ యువ వికాసం ద్వారా యువత వ్యాపారాలు, స్వ యం ఉపాధికి అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు.

హైదరాబాద్ ట్రాఫిక్ ఫోర్స్‌లో ట్రాన్స్‌జెండర్స్‌ను నియమించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని గుర్తుచేశారు. డ్రై పోర్టు నిర్మా ణం, ఏపీలోని ఓడరేవుతో అనుసంధానం, ఫ్యూచర్ సిటీలో ఏఐ నగరం, యంగ్ ఇండి యా స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మా ణం జరుగుతోందని వివరించారు.

ప్రపంచంలోనే గొప్ప ఈవెంట్లలో ఒకటిగా పేరొం దిన మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయని తెలిపారు. వీటితోపాటు మరిన్ని ప్రపంచస్థాయి ఈవెంట్ల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు.

తెలంగాణ రైజింగ్ కార్యాచరణ ద్వారా ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం సమతుల్యంగా సాగు తోందని పేర్కొన్నారు. ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో, హైదరాబాద్‌ను అత్యద్భుత నగరంగా తీర్చిదిద్దడంలో అందరి సహకారం కోరుతున్నామని తెలిపారు. హైదరాబాద్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని, మన విజయాలను ప్రపంచానికి చూపాలని పిలుపు నిచ్చారు.

త్వరలోనే ఏఐ వర్సిటీ ప్రారంభం: మంత్రి శ్రీధర్‌బాబు

ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో ప్రపంచంలోనే తెలంగాణను లీడర్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్ది ళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణను ఏఐ లీడర్‌గా మార్చేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించామని పేర్కొన్నారు.

ఏఐ సిటీకి శ్రీకారం చుట్టామని, ఇందులో భాగస్వామ్యమయ్యేందుకు మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపాయని చెప్పారు. ఏఐలో ప్రపంచస్థాయి నిపుణులను తయా రు చేసేందుకు త్వరలోనే ఏఐ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నామని స్పష్టం చేశారు. పౌర సేవలను ఏఐతో అనుసంధానించి ప్రజల ముంగిటకు చేర్చేందుకు ప్రభు త్వం కృషి చేస్తోందని తెలిపారు.

ఆన్‌లైన్‌లోనూ నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీకి అనుబంధంగా డిజిటల్ వర్సిటీని ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ హబ్‌గా మారిందని చెప్పారు. ఈ జీసీసీలను గ్లోబల్ వాల్యూ యాడెడ్ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు ప్రభు త్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.