జిల్లా పద్మశాలి సర్వసభ్య సమావేశానికి తరలి వెళ్లిన బాన్సువాడ పద్మశాలీలు
14-06-2026 02:39 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈఎస్ఆర్ పంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించిన జిల్లా పద్మశాలి సంఘం సర్వసభ్య సమావేశం (మనోహరం)కు బాన్సువాడ డివిజన్ లోని పద్మశాలి సంఘం సభ్యులు బారీ సంఖ్యలో వాహనాల్లో తరలివెళ్లారు. అదేవిధంగా జిల్లా సమావేశంలో సంఘం బలోపేతం, సంఘ సభ్యుల ఐక్యత, సంఘ సభ్యుల సంక్షేమం, పేద విద్యార్థుల సంక్షేమం, పేద కుటుంబాలకు అండగా ఉండడం, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం వంటి అంశాలు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఇటీవల జిల్లాలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్, సర్పంచులు, ఉపసర్పంచ్లు, కౌన్సిలర్లు,వార్డు సభ్యులు, ఇతరత్రా చైర్మన్ పదవుల్లో ఉన్న పద్మశాలి కుల సంఘం సభ్యులను ఘనంగా శాలువ, మేమంటో లతో సన్మానం చేశారు.






