calender_icon.png 21 November, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ అధికారులు.. ముళ్ళకంప తొలగించరా..?

16-08-2024 11:45:22 AM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 20వ వార్డులో గల సులబ్ కాంప్లెక్స్ పక్కనున్న ముళ్ళ కంపను తొలగించాలని బస్తికి చెందిన ఆర్.టి.ఐ, సామాజిక కార్యకర్త జుట్టు రాజన్న అధికారులను కోరుతున్నారు. గత నెల రోజుల నుండి మురికి కాలువ పై ఉన్న ముళ్లకంచెను తొలగించి ఇబ్బందులు తీర్చాలని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మురికి కాలువపై ముళ్ల కంచె తొలగించకపోవడంతో నీరు నిలిచిపోయి దోమలు, ఈగలు వ్యాప్తి చెంది టైఫాయిడ్ మలేరియా లాంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు తలెత్తుతున్నాయని ఆయన ఆరోపించారు. గత కొంతకాలంగా బస్తీ ప్రజలు ముళ్ళ కంచె వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారులు ముళ్లకంచెను తొలగించేందుకు ఆదేశాలు ఇస్తున్నా, శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపల్ జవాను ఈ సమస్యను పరిష్కరించడం లేదని ఆయన ఆరోపించారు. అధికారులు సమస్యను పరిష్కరించ నట్లయితే తాను శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపల్ జవాన్ పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు