calender_icon.png 21 November, 2025 | 11:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి- కునారం రైల్వే ఓవర్ బ్రిడ్జి రాబోయే వానాకాలం నాటికి సిద్దం చేయాలి

16-08-2024 12:50:04 PM

 జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి,(విజయక్రాంతి): రాబోయే వానాకాలం నాటికి పెద్దపల్లి కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత ఏజెన్సీని ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావుతో కలిసి పెద్దపల్లి కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించి మాట్లాడుతూ... రూ. 119 కోట్ల 50 లక్షల వ్యయంతో పెద్దపల్లి కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రభుత్వం నిర్మిస్తుందని, శ్రీరాంపూర్ వైపుగా 28 స్లాబ్ లు, 150 మీటర్ల అప్రోచ్, పెద్దపల్లి వైపుగా 18 స్లాబ్ లు, 145 మీటర్ల అప్రోచ్ తో పనులు జరుగుతున్నాయని, పెద్దపల్లి- కూనారం ఆర్.ఓ.బీ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన పెండింగ్ భూ సేకరణ ప్రక్రియ నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలైన నేపథ్యంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని, వచ్చే వానాకాలం నాటికి నాణ్యతతో కూడిన ఆర్.ఓ.బీ పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, పెద్దపల్లి తహసిల్దార్ , ఈఈ ఆర్ అండ్ బీ భావ్ సింగ్, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.