01-05-2025 12:02:33 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా బిజెపి కార్యాలయంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బసవేశ్వర మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. మహాత్మా బసవేశ్వర మహారాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కుల వ్యవస్థ వర్గ వివాదాలను లింగ వ్యవస్థను సమూలంగా నిర్మూలించిన అభ్యుదయ వాది బసవేశ్వర మహారాజ్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఓ బి సి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గండమల్ల ఆనంద్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు పైండ్ల శ్రీనివాస్, చింతల శివకృష్ణ, పులి శ్రీనివాస్, గంగాధర, జనార్ధన్, పరికిపండ్ల అశోక్, దేవేందర్, చంద్రయ్య పాల్గొన్నారు.