01-05-2025 12:00:00 AM
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు
చిలుకూరు, ఏప్రిల్ 30: చిలుకూరు మండల కేంద్రంలోని బుధవారం. దొడ్డ నరసయ్య భవన్లో వడ్డేపల్లి కోటేష్,అధ్యక్షతన సిపిఐ చిలుకూరు మండల కౌన్సిల్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, పాల్గొని వారు మాట్లాడుతూ, ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా గ్రామ గ్రామాన వీధి వీధినా ఎర్రజెండా ఎగురవేసి మే డే ను ఘనంగా నిర్వహించాలని కార్మికులకు కర్షకులకు పిలుపునిచ్చారు.
మే 6వ తేదీన నారాయణపురం గ్రామంలో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చిలుకూరు మండల మహాసభలను జయప్రదం చేయాలని, ఇట్టి మహాసభల విజయవంతం కోసం అన్ని గ్రామాల నాయకత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మండల మహాసభలో మాజీ శాసనసభ్యులు సిపిఐ జాతీయ సమితి సభ్యులు కామ్రేడ్ పల్లా వెంకటరెడ్డి, పాల్గొంటారని తెలిపారు .
ఈ మహాసభలలో మండల నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని తద్వారా మండలంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇబ్బందులను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కమ్యూనిస్టు నాయకులు కార్యకర్తలు కృషి చేస్తారని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ చిలుకూరు మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, షేక్ సాహెబ్ అలీ, కాంపాటి వెంకటయ్య, చేపూరి కొండలు, దొడ్డ వెంకటయ్య, రెమిడాల రాజు, చిలువేరు ఆంజనేయులు,పిల్లుట్ల కనకయ్య, దొడ్డ నాగేశ్వరరావు,తాళ్లూరి వెంకటయ్య,కోటయ్య, సాతులూరి అలివేలు, సిరాపురపు శ్రీనివాస్, ముక్కా లక్ష్మీనారాయణ,వస్రాం నాయక్, మల్లెపంగు సూరిబాబు, జిల్లా శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.