27-09-2025 09:00:47 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది శనివారం సాయంత్రం ‘భారీ’ బతుకమ్మను పేర్చి ఆటపాటలతో కోలాహలంగా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కే.అనిల్ కుమార్ పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు, మెప్మా సిబ్బంది ఆటపాటలతో కలెక్టరేట్ ఆవరణ పూర్తిగా కోలాహలంగా మారింది.