calender_icon.png 27 September, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

27-09-2025 10:03:24 PM

పటాన్ చెరు: పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ప్రాధాన్యతను తెలియజేస్తూ వారి ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీల సేవలు ప్రశంసనీయమని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం పటాన్ చెరు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అంగన్వాడి శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని 170 అంగన్వాడి సెంటర్లలో విధులు నిర్వర్తిస్తున్న 170 మంది టీచర్లు, 170 మంది ఆయాలకు రెండు జతల చొప్పున చీరలను ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోషకాహార లోపంతో ఎదుగుదలలేని పిల్లల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోందని, తక్కువ బరువుతో పుట్టే పిల్లలు, బలహీనంగా ఉంటే గర్భిణీలు, మాత శిశు మరణాల సంఖ్య తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తోందని తెలిపారు. అక్టోబర్ 10 వరకు జరగనున్న పోషకాహార వారోత్సవాలలో భాగంగా గర్భిణీలకు, బాలింతలకు, కిషోర బాలికలకు పోషకాహార ప్రాధాన్యతను తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు.