27-09-2025 09:58:47 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఘనంగా జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ టి. రాజేశ్వర్ పూలమాల వేసి, ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం రాజీలేని పోరాటాలను నిర్వహించిన గొప్ప దీశాలి అని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడిన త్యాగశీలి అని, ఆయన గొప్ప తెలంగాణ స్వాతంత్ర సమరయోధుడని, మంత్రివర్యులుగా పని చేశారని, తెలంగాణ వాది అని, ఆయన చూపిన మార్గం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయ సిద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.