calender_icon.png 21 September, 2025 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోటరీ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

21-09-2025 07:38:53 PM

అర్మూర్ (విజయక్రాంతి): అర్మూర్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని చేనేత కాలనీ చౌరస్తా వద్ద గల ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. రోటరీ అధ్యక్షుడు రాధా కిషన్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమం నుండి తెలంగాణ ఉద్యమం వరకు కృషి చేసిన అలుపెరుగని పోరాటయోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రధాన కార్యదర్శి ఖాందేశ్ సత్యం, కోశాధికారి కోట నరేష్, మాజీ అధ్యక్షులు దాసరి సునీల్ కుమార్, వంగ వివేకానంద, గంగమోహన్ చక్రు, చెలిమేల రాజేందర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.