28-09-2025 08:14:41 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఆర్.బి.వి.ఆర్.ఆర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం బతుకమ్మ వేడుకలను సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి కవిత రెడ్డి హాజరయ్యారు. ముందుగా బతుకమ్మను రంగురంగుల పూలతో పేర్చి, కోలాటలు వేస్తూ.. బతుకమ్మ ఆడారు. దీంతో ఫంక్షన్ హాల్ ప్రాంగణమంతా పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి కవిత రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సామూహిక జీవన విధానానికి, ప్రజల ఐక్యతకు బతుకమ్మ పండుగ ఒక నిదర్శనమన్నారు. గౌరీ దేవి ఆశీస్సులతో అందరికీ మంచి ఆరోగ్యం సమకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు వడ్డీ రాజేందర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ రాజేశ్వర్ రెడ్డి, కోశాధికారి దామోదర్ రెడ్డి, సభ్యులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.