calender_icon.png 28 September, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి

28-09-2025 08:10:36 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఆదివారం రోజున సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుల, మండల కార్యదర్శుల సంయుక్త సమావేశం జిల్లా కార్యవర్గ సభ్యులు నాగెల్లి లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సర్పంచ్ ఎంపీటీసీ స్థానాల పదవీకాలం ముగిసి దాదాపుగా 20 నెలలు అవుతుందని, 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని చట్టం ఆమోదించినప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడం మూలంగా గ్రామాలు అభివృద్ధికి నోచుకోక అభివృద్ధి కుంటుపడిందని, కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన వేల కోట్ల రూపాయల నిధులు నిలిచిపోయాయని అన్నారు. స్థానిక సంస్థలకు సంబంధించిన pపూర్వపరాలను, విధి,విధానాలను, పరిపాలనను,అభివృద్ధిని తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక కమిటీ బృందాన్ని కేరళ రాష్ట్రానికి పంపించి అధ్యయనం చేయించాలని సూచించారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 28 అంశాలు పంచాయతీరాజ్ కు అప్పగించాలని, 18 అంశాలు మున్సిపాలిటీలకు అప్పగించాలన్నారు.

స్థానిక సంస్థలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిన తరుణంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించడం సంతోషకరమైనదే, అలాగే ఎస్సీ ఎస్టీలకు కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించి వారికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, గూడెం లక్ష్మి,బత్తుల బాబు,కసిరెడ్డి సురేందర్ రెడ్డి,నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య, వివిధ మండలాల కార్యదర్శులు బండ రాజిరెడ్డి, చొక్కల్ల శ్రీశైలం, లంకాదసరి కల్యాణ్, ఉమ్మెంతల రవీందర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.