29-09-2025 10:14:23 PM
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేది బతుకమ్మ పండుగ అని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి(Agricultural Advisor Pocharam Srinivas Reddy) అన్నారు. సోమవారం సద్దుల బతుకమ్మ సందర్భంగా స్వగ్రామమైన పోచారంలో కుటుంబ సభ్యులతో కలిసి సతిసమేతంగా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణంతో పాటు మండలంలోని పోచారం, దేశాయ్ పేట్, పాత బాన్సువాడ చావిడి వద్ద, బాన్సువాడ పట్టణంలోని రామాలయం దగ్గర, శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయం వద్ద జరిగిన సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సతీమణి పోచారం సోని రెడ్డి పాల్గొన్నారు. ఈ బతుకమ్మ సంబరాలలో బాన్సువాడ మండలం, బాన్సువాడ పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున మహిళలు, ఆడపడుచులు పాల్గొన్నారు.