calender_icon.png 29 September, 2025 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాదాస్పదంగా మారిన రంగాపురం చర్చి

29-09-2025 10:18:02 PM

గరిడేపల్లి (విజయక్రాంతి): గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామంలో ఒక చర్చి వివాదాస్పదంగా మారింది. గ్రామంలో ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక చర్చి తన పేరు మీదకు మార్చాలంటూ సూర్యాపేటకు చెందిన ఒక వ్యక్తి గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు గ్రామంలో నిర్మించిన చర్చి గ్రామానికి చెందినదని గ్రామస్తులు అనేకమంది ప్రతి వారం చర్చిలో ప్రార్థనలు చేస్తున్నారని తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామాల్లో ఉన్న చర్చి ఇప్పుడు మాది అంటూ ఒక వ్యక్తి వచ్చి దరఖాస్తు చేసుకోవటానికి గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి ఆధారాలు లేకుండా చర్చి ఎవరి పేరు మీదికి ఎక్కించరాదని గ్రామస్తులు గ్రామపంచాయతీ అధికారికి, మండల అభివృద్ధి అధికారికి వినతిపత్రం అందజేశారు.

సూర్యాపేటకు చెందిన సదరు వ్యక్తి తన పరపతిని ఉపయోగించి తప్పుడు దృవపత్రాలను సృష్టించి చర్చిని కొనుగోలు చేసినట్లుగా అధికారులను బెదిరిస్తూ, స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. గతంలో గ్రామానికి చెందిన లక్ష్మమ్మనే మహిళ సెవెంత్ డే అనే సంస్థకు చర్చి నిర్మించడం కోసం అమ్మినట్లు గ్రామస్తులు తెలిపారు. సెవెంత్ డే సమస్త తనకు అందని తప్పుడు దృవపత్రాలు చూపిస్తూ రికార్డులలో తన పేరు నమోదు చేయాలంటూ అధికారులని బెదిరించడాన్ని గ్రామస్తులు తీవ్రంగా ఖండించారు. సెవెంత్ డే సంస్థ నిర్వాహకులు ఎవరికి అమ్మలేదని, త్వరలోనే గ్రామానికి వచ్చి చర్చి విషయంలో పూర్తి వివరాలు అందిస్తామని వారు తెలిపినట్లు గ్రామస్తులు వివరించారు. ఈ విషయంపై ఎంపీడీవో సరోజ కు సోమవారం రంగాపురం గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోయిల్ల నవీన్, మీసాల వెంకన్న, ఏసురత్నం, అరవిందు, బుచ్చయ్య, బిక్షం, సైదులు, ముత్తయ్య, రవి, రాములు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.