29-09-2025 10:12:12 PM
పెద్దపెల్లి (విజయక్రాంతి): తీరొక్క పూలతో అలంకరణ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులందరూ అట్టహాసంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా ఎలిగేడు మండలంలోని వారి స్వగ్రామమైన శివపల్లి నివాసంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు సతీమణి పావనితో కలిసి బతుకమ్మను ఎత్తుకొని వేడుకలను ప్రారంభించారు. అలాగే ఎమ్మెల్యే తనయుడు గోపికృష్ణ రావు పాల్గొన్నారు.