calender_icon.png 13 November, 2025 | 11:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల హక్కుల కోసం దీక్ష!

13-11-2025 10:46:15 PM

విజయవంతంగా ముగిసిన బీసీ ధర్మపోరాటం

రామాయంపేట: మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల ధర్మపోరాట దీక్ష విజయవంతంగా ముగిసింది. ఈ దీక్షకు మెదక్ జిల్లా బీసీ సంఘం గౌరవాధ్యక్షుడు మెట్టు గంగారం నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట ప్రాంత కుల సంఘాల నాయకులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు, చింతల శేఖర్, బక్కయ్యగారి యాదగిరి, శీలం అవినాష్ రెడ్డి, అనిల్ కుమార్, సుంకోజి దామోదర్, పోచమ్మల గణేష్, అశ్విని ముదిరాజ్, అల్లాడి వెంకటేష్, మామిడి సిద్ధరాములు, చంద్రశేఖర్, చింతల స్వామి, శ్రీశైలం తదితరులు పాల్గొని బీసీల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ “బీసీ రిజర్వేషన్ ఎవరి భిక్ష కాదు... మా హక్కు!” అని గట్టిగా నినదించారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకోసం పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. కార్యవర్గ సభ్యుడు రాగి రాములు మాట్లాడుతూ “హక్కుల కోసం బీసీలు ఐక్యంగా నిలిస్తేనే న్యాయం సాధ్యం. ఈ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం రాజ్యాంగ సవరణ సాధించడమే” అని స్పష్టం చేశారు. బీసీ సమాజ హక్కుల పరిరక్షణకై రామాయంపేట నుంచి వెలువడిన ఈ ధర్మపోరాట దీక్ష బీసీల ఐక్యతను ప్రతిబింబించిందని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అభిప్రాయపడ్డారు.