13-11-2025 10:42:10 PM
టూటౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్..
సిద్దిపేట క్రైం: గంజాయి ఇతర మత్తుపదార్థాలు కలిగి ఉన్నా, అక్రమంగా రవాణా చేసినా, విక్రయించినా చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని సిద్దిపేట టూటౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ హెచ్చరించారు. గురువారం నార్కోటిక్ డాగ్స్ తో టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డెర కాలనీలో కిరాణా షాపులు, టీ కొట్టులు, ఇతర అనుమానాస్పద ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్తుపదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు.
యువత తాత్కాలిక ఆనందం కోసం జీవితాలు నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. మత్తుపదార్థాలు ఎవరైనా కలిగి ఉన్నా, అమ్మినా డయల్ 100, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్(1908) లేదా టూటౌన్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇన్స్పెక్టర్ వెంట హెడ్ కానిస్టేబుల్ సత్యం, కానిస్టేబుల్ లింగం, కనకయ్య, మహిళా కానిస్టేబుల్ చిత్ర ఉన్నారు.