24-07-2025 11:40:14 PM
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చింతల శంకర్ నేత..
కామారెడ్డి (విజయక్రాంతి): భారత ఉపరాష్ట్రపతి పదవికి తెలంగాణ నుండి బీసీలకు అవకాశం కల్పించాలని ముఖ్యంగా బీసీ వర్గాలకు సేవ చేస్తున్న ఆర్ కృష్ణయ్యకు అవకాశం ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల శంకర్ నేత(District President Chintala Shankar Neta) అన్నారు. గురువారం కామారెడ్డి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాల కాలంగా బీసీల సమస్యల గురించి పోరాడుతున్న వారికి ఉపరాష్ట్రపతిగా అవకాశం కల్పించాలని బీసీ వర్గాలు ముక్తకంఠంతో కోరుతున్నమని ఆర్ కృష్ణయ్య ఉపరాష్ట్రపతిగా అన్ని విధాలుగా అర్హుడని అన్నారు.
గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, అనేక పదవులను చేపట్టిన అనుభవం అర్హత కలిగిన వ్యక్తిగా నాయకుడిగా బీసీల ఆరాధ్య దైవంగా ప్రజల మన్ననలను పొందిన ఆర్ కృష్ణయ్యకు భారత ఉపరాష్ట్రపతి అవకాశం కల్పించాలని అన్నారు. పోయినసారి ఆంధ్రప్రదేశ్ చెందిన వెంకయ్య నాయుడుకు అవకాశం కల్పించారు, ఈసారి బీసీ నేత ఆర్ కృష్ణయ్యకు అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు. బీసీ వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. బీసీల అధినేత ఆర్.కృష్ణయ్య కు అవకాశం కల్పిస్తే బీసీల అందరికీ న్యాయం చేసినట్టు అవుతుందని ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల శంకర్ నేత అన్నారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించి బీసీ బిడ్డకు ఉపరాష్ట్ర పదవి ఇవ్వాలన్నారు.