calender_icon.png 3 August, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న కేటీఆర్

25-07-2025 12:00:00 AM

  1. నిండు నూరేళ్లు వర్ధిల్లాలని దీవించిన కేసీఆర్ దంపతులు
  2. కేటీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి ఎక్స్ వేదికగా శుభకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి
  3. అనుకున్న లక్ష్యాలను పూర్తి చేయాలి: జగన్
  4. కేటీఆర్‌కు వెల్లువెత్తిన శుభాకాంక్షలు

హైదరాబాద్, జులై 24 (విజయక్రాంతి): తన పుట్టినరోజు సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. గురు వారం తన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి కేటీఆర్ ఎర్రవెల్లి కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లారు. అక్కడ తన తల్లిదండ్రులకు పాదాభివందనం చేసిన కేటీఆర్ వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను కేసీఆర్ ఆలింగం చేసుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కేసీఆర్ శోభమ్మ దంపతులు కేటీఆర్‌ను ఆశీర్వదించారు. 

కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి బర్త్ డే విషెస్ 

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఎక్స్ వేదికగా ఆయన పోస్టు చేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురోగ్యాలు ప్రసాదించాలని రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. 

కేటీఆర్‌కు జగన్ శుభాకాంక్షలు

కేటీఆర్‌కు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని, అనుకున్న లక్ష్యాలను పూర్తి చేయాలని కోరుకుంటున్నట్లు ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు.

కేటీఆర్‌కు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఏపీ మాజీ మంత్రి విడుదల రజని, సినీ నటుడు రాంచరణ్ బర్త్ డే విషెస్ తెలిపారు. కేటీఆర్‌కు బీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.