calender_icon.png 16 November, 2025 | 12:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీసీ నినాదమే విజయం

15-11-2025 12:00:00 AM

తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జిలుకర రవికుమార్

ముషీరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీ నాదమే విజయం సాధించిందని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థా పక అధ్యక్షుడు జిలుకర రవికుమార్ అన్నా రు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించటం బీసీ సమాజానికి దక్కిన గౌరవమని ఆయన స్పష్టం చేశారు.

ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి 42 శాతం బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించడానికి అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లి ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ ఒకటి నుంచి జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో బీసీ బిల్లు ను ప్రవేశపెట్టి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూ ల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశా రు.

రాష్ట్రంలో బీసీ నాదం బలంగా ఉందని ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రెడ్డి జాగృతి హైకోర్టులో వేసిన పిటిషన్ లను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నవీన్ యాదవ్ కు ప్రజారాజ్యం పార్టీ తరఫున అభినందనలు తెలి పారు. ఈ కార్యక్రమంలో ప్రజా రాజ్యం పార్టీ నేతలు విశ్రాంత ఐఐఎస్ అధికారి కూనపు రెడ్డి హరిప్రసాద్, విజయ రెడ్డి, కరమళ్ళ నోవా, ఉదయ్ సింగ్ పాల్గొన్నారు.