calender_icon.png 16 November, 2025 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

17న ఢిల్లీలో దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన

15-11-2025 12:00:00 AM

ఢిల్లీకి బయలుదేరిన ఓయూ మాదిగ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, రీసెర్చ్ స్కాలర్స్

ముషీరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పైన కోర్టు హాలులోనే బూటుతో దాడి చేసిన దుండగుడిపై సుమోటోగా కేసు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఓయూ విద్యార్థులు డిమాండ్ చేశారు.

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఈ నెల 17న ఢిల్లీలోనీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించ తలపెట్టిన ‘దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన‘ను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం ఎంఎస్‌ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కొమ్ము శేఖర్ మాదిగ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ సికిం ద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఢిల్లీకి బయలుదేరారు.

ఈ కార్యక్రమంలో వలిగొండ నరసింహ, తాళ్ళ అజయ్, వెంపటి సైదులు, పల్లె అర్జున్, వేదాంథ్ మౌర్య, చౌట గణేష్, ఎంఎస్‌ఎఫ్ ఓయూ అధ్యక్షుడు మంద రాజు మాదిగ, కోల హరీశ్ మాదిగ, రమేష్ మాదిగ, శ్రీశైలం మాదిగ, శివ, సోనేరావు, జగదీష్, రేపల్లె రమేష్ మాదిగ, కొమ్ము అచ్యుత్, మహేష్ మాదిగ, రాజేంద్ర ప్రసా ద్, వెంపటి వంశీ మాదిగ, గద్దల హరికృష్ణ మాదిగ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.