15-10-2025 07:10:29 PM
నకిరేకల్ (విజయక్రాంతి): ఈ నెల 17, 18న నల్లగొండ జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్ భవనంలో జరిగే ప్రగతిశీల మహిళా సంఘం(పి.ఓ. డబ్ల్యూ) తెలంగాణ రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలనీ ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు బూరుగు లక్ష్మి కోరారు. బుధవారం నకిరేకల్ పట్టణoలోని మెయిన్ సెంటర్ లో శిక్షణ తరగతుల కరపత్రాలను ఆమె ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. పి.ఓ.డబ్ల్యూ సంస్థ మహిళా సమస్యలపై, స్త్రీ, పురుష సమానత్వం కోసం గత 50 సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాటం చేస్తుందని తెలిపారు.
మద్యం, గంజాయి, డ్రగ్స్ తదితర మాదక ద్రవ్యాలను అరికట్టాలని దశబ్దాలగా ఆందోళనలు చేస్తుందని ఆమె పేర్కొన్నారు. హింసకు కారనమైన మాదక ద్రవ్యాలను అరికట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ తరగతులకు రాష్ట్ర నలుమూలల నుండి 150 మంది మహిళా ప్రతినిధులు పాల్గొంటారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు మర్రి సంతోష, పుష్ప, రాణి, ఎల్లమ్మ, ఎస్ కె సైదా, వెంకటమ్మ, స్వరూప, నాగమణి, యాదమ్మ, అమ్ములు తదితరులు పాల్గొన్నారు.