23 June, 2026 | 12:53 AM

రోడ్‌మ్యాప్ రెడీ

23-06-2026 12:03 AM

వన్డే ప్రపంచకప్‌పై బీసీసీఐ ఫోకస్

బ్లూ ప్రింట్ సిద్ధం చేసిన గంభీర్

వీలైనంత ఎక్కువ మ్యాచ్ ప్రాక్టీస్

సఫారీ పిచ్‌లకు తగ్గట్టు జట్టు కాంబినేషన్

వన్డే ప్రపంచకప్ 2027 కోసం భారత జట్టు సన్నద్ధతపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. కోచ్ గంభీర్, సెలక్టర్లతో కలిసి రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. దక్షిణాఫ్రికా పిచ్‌లు, వాతావరణానికి అనుగుణంగా జట్టు కాంబినేషన్‌ను సిద్ధం చేయడం, యువ ఆటగాళ్లకు పెద్దపీట వేయడం, వీలైనంత ఎక్కువ వన్డే ప్రాక్టీస్ ఉండేలా చూడడం దీనిలో ప్రధానాంశాలు. కోచ్ గంభీర్ , సెలక్టర్లు సమన్వయంతో పనిచేస్తున్నారని బీసీసీఐ స్పష్టం చేసింది.

ముంబై, జూన్ 22 : భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచి 15 ఏళ్లు అవుతోంది. 2011లో ధోనీ సారథిగా వరల్ కప్‌ను ము ద్దాడిన టీమిండియా మళ్లీ దానిని అందుకోలేకపోయింది. 2023లో ఫైనల్ వరకూ చేరి టైటిల్‌పై ఆశలు రేకెత్తించినా కంగారూల చేతి లో పరాజయం పాలవడం అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేదు.

ఇప్పుడు 2027లో మెగా టోర్నీలో ఛాంపియన్ గా నిలవాలనే లక్ష్యంగా సన్నద్ధమవుతోంది. దీని కోసం బీసీసీఐ సెలక్టర్లు, కోచ్ గౌతమ్ గంభీర్ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బోర్డు సెక్రటరీ దేవజీత్ సైకియా చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటికే రోడ్ మ్యాప్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. 2027 వన్డే ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు ప్రారంభించామ ని సైకియా వెల్లడించారు. ఇంగ్లాండ్ టూర్ నుంచే మిషన్ వన్డే ప్రపంచకప్ మొద లవుతోందని బోర్డు వర్గాలు తెలిపాయి.

ఇంగ్లాండ్ పిచ్‌లపై మన జట్టు వన్డేల్లో ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మా రింది. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో సీనియ ర్లు, యువ ఆటగాళ్ల కూర్పుతో బలంగానే కనిపిస్తోంది. గతం లో సెలక్టర్లు, కోచ్ గంభీర్‌తో కొంద రి ఎంపిక విషయంలో విభేదించారన్న ప్రచా రం జరిగింది. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కో చ్ గౌతమ్ గంభీర్ పూర్తి సమన్వయంతో పని చేస్తున్నారని స్పష్టం చేసింది. సెలక్టర్లు, కోచింగ్ సిబ్బంది అందరూ ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నా రని సైకియా తెలిపారు.

కేవలం ప్రస్తుత ఫలితాలే కాకుండా 2027 వరల్డ్ కప్‌ను లక్ష్యంగా పె ట్టుకుని జట్టు ఎంపిక, తుది జట్టు కూర్పు వ్యూహాలు ఉండబోతున్నాయనేది అర్థమవుతోంది. 2023 వరల్డ్‌కప్ తర్వాత భా రత వన్డే జట్టులో అనేక మార్పు లు చోటుచేసుకున్నాయి. కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో శుభ్మన్ గిల్ బాధ్యతలు అం దు కున్నాడు. రోహిత్, కోహ్లీ వచ్చే ప్రపంచకప్ లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వీరిద్దరూ ఖచ్చితంగా జట్టులో ఉంటారా లేదా అ నేది గంభీర్ హామీ ఇవ్వడం లేదు.

కాకుంటే మెగాటోర్నీ కోసం గంభీర్ పక్కా ప్లానింగ్‌తో ముం దుకెళుతున్నట్టు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. దీనిలో భాగంగా గంభీర్ వన్డే ప్రపంచకప్‌ను దృష్టి లో ఉంచుకుని బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేశాడు. యువ ఆటగాళ్ళకు ప్రాధాన్యత ఇస్తూ సీనియర్ ఆటగాళ్ల తో కలిపి జట్టును సిద్ధం చేయడం, దక్షిణాఫ్రికా పిచ్, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జట్టు కాంబినేషన్ ను సెట్ తేయ డం, వీలైనన్ని ఎక్కువ వన్డేలు ఉండేలా చూడడం కీలకాంశాలుగా ఉన్నాయి.

వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిస్తున్న సఫారీ పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ బ్యాటింగ్ చేయం అంత ఈజీ కా దు. ఆపిచ్‌లపై ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆడేలా బ్యా టర్లను తీర్చిదిద్దడం గంభీర్‌కు ప్రధాన టాస్క్‌గా చెప్పొచ్చు. బౌలింగ్‌లో నూ బుమ్రాతో పా టు అతనికి సపోర్ట్‌గా పలువురు యువ పేసర్లను సిద్ధంగా ఉంచడం కూడా గంభీర్ ప్లాన్‌లో మరో టాస్క్. మొ త్తం మీద 2027 వన్డే ప్రపంచకప్‌ను గెలవడమే లక్ష్యంగా గంభీర్ బ్లూ ప్రింట్ ఉండబోతోంది.