23 June, 2026 | 2:05 AM

గ్రామంలో మద్యం వికయిస్తే రూ .10,000 జరిమానా

23-06-2026 12:51 AM

జమ్మికుంట జూన్ 22(విజయ క్రాంతి) గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ. 10,000 జరిమానా విధించనున్నట్లు జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామ సర్పంచ్  సర్పంచ్ పసుల తిరుమల,ఉప సర్పంచ్ కస్తూరి శ్రీనాథ్ పాలకవర్గం తీర్మానం చేశారు.

గ్రామంలో విచ్చలవిడిగా అధిక ధరలకు  మద్యం విక్రయిస్తూ  గ్రామస్తుల జేబులకు చిల్లులు పెడుతూ, ప్రజల ఆరోగ్యంతో బెల్ట్ షాప్ నిర్వాహకులు చెలగాటమాడుతున్నారని , గ్రామంలో బెల్ట్ షాపులను మూసివేయాలని,   మద్యం విక్రయిస్తే రూ. 10,000 జరిమానా విధించడంతో పాటు సమాచారం ఇచ్చిన వారికి రూ. 2000 పారితోషకాన్ని ప్రకటించారు.