23 June, 2026 | 2:07 AM

జంగపల్లి విద్యార్థులకు ఆర్ధిక చేయూత

23-06-2026 12:53 AM

మనకొండూర్, జూన్22(విజయక్రాంతి): మనకొండూర్ నియోజకవర్గంగన్నేరువరం మండలం జంగపల్లి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన విద్యార్థిని ఎర్ల దీక్షితకు గణిత ఉపాధ్యాయులు  వాల శంకర్ రావు  చొరవతో  గంగిపల్లి గ్రామ వాస్తవ్యులు, వ్యాపారవేత్త  వాల  ప్రసాద రావు  ఉన్నతవిద్య కోసం 50,000 రూ‘ల విరాళాన్ని  అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా 2025-26 పది  ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచి బాసర ట్రిపుల్ ఐటి కి ఎంపిక అయిన ఐదుగురువిద్యార్థులు  చొక్కల్ల వర్షిణి, యాశ్వాడ సాత్విక, బోడ హాసిని, గుంటుక వినయ్, అనుమాసుల అక్షరలను పాఠశాల  ప్రధాన ఉపాధ్యాయురాలు శారద  అభినందించి ,సన్మానించారు.

ఈ కార్యక్రమంలో  జంగపల్లి సర్పంచి  తాడూరి కరుణశ్రీ- వెంకట రమణారెడ్డిగారు, ఉపసర్పంచ్ మాంకాలి ప్రభాకర్ లు ట్రిపుల్ ఐటి  కి ఎంపిక అయిన విద్యార్థులను ఘనంగా సన్మానించి, ఒక్కొక్క విద్యార్థికి 2000 రూ‘ల చొప్పున నగదు ప్రోత్సాహాన్ని అందించారు.మరియు ఉపాధ్యాయులందరినీ ఘనంగా సత్కరించారు. పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు రవీందర్ రెడ్డి  పది లోమొదటి స్థానం సాధించిన వర్షిణికి 3116/- రూ‘లు, రెండవ స్థానం సాధించిన సాత్వికకు 2116/- రూ‘ల చొప్పున నగదు ప్రోత్సాహం అందించారు.