04-01-2026 12:00:00 AM
హిందువులపై దాడుల నేపథ్యంలో నిర్ణయం
ముంబై, జనవరి 3 : ఐపీఎల్ 2026 సీజన్ కోసం సిద్ధమవుతున్న కోల్ కత్తా నైట్ రైడర్స్‌కు బిగ్ షాక్ తగిలింది. బంగ్లాదేశ్ పేస ర్ ముస్తఫిజుర్ రహమాన్‌ను వదిలేయాలని బీసీసీఐ ఆ ఫ్రాంచైజీకి ఆదేశాలిచ్చింది. బం గ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడు లు, వరుస హత్యల పరిణామాలతో బీసీసీఐ ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది చివర్లో జరిగిన వేలంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ముస్తఫిజుర్‌ను రూ.9.2 కోట్ల రూపాయలకు దక్కించుకుం ది. అయితే ఇప్పుడు ఊహించని విధంగా ముస్తఫిజర్ సేవలను కోల్పోయింది.
గత కొంతకాలంగా బంగ్లాలో పరిస్థితులు ఏ మా త్రం బాగాలేవు. హిందువులపై ఘోరమైన దాడులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ నలుగురు హిందువులు అక్కడి అల్లరిమూకల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు, బీసీసీఐపై రాజకీయ నేతలు విమర్శలు గుప్పిం చారు. దీంతో అతన్ని తప్పించినట్టు బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా వెల్లడించారు.