04-01-2026 12:00:00 AM
సిరీస్‌లో ఆసీస్‌కు 3 ఆధిక్యం
భారీ భద్రత మధ్య సిడ్నీ గ్రౌండ్
సిడ్నీ, జనవరి 3 : యాషెస్ సిరీస్ చివరి టెస్టుకు అంతా సిద్ధమైంది. సిడ్నీ క్రికెట్ గ్రౌం డ్ వేదికగా ఆదివారం నుంచి ఆఖరి టెస్ట్ జరగబోతోంది. ఇప్పటికే సిరీస్ గెలుచుకున్న ఆస్ట్రేలియా 4 ఆధిక్యం సాధించాలని భా విస్తుంటే... బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించిన ఇంగ్లాండ్ అదే జోరు కొనసాగించాలని పట్టుదలగా ఉంది. మరో గెలుపుతో యాషెస్ సిరీస్‌ను ముగించాలని ఎదురుచూస్తోంది.
ఇరు జట్లు ఇప్పటికే తమ 12 మంది కాంబినేషన్‌ను ప్రకటించగా మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశముంది. కమ్మి న్స్ లేకపోవడంతో స్టీవ్ స్మిత్ సారథిగా కొనసాగనున్నాడు. కామెరూన్ గ్రీన్ పేలవ ఫా మ్ ఆసీస్‌కు ఇబ్బందిగా మారింది. సిడ్నీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్న అంచనాల నేపథ్యంలో టాడ్ మర్ఫీ తుది జట్టులోకి రావొచ్చు. అటు ఇంగ్లాండ్ సైతం పలు మా ర్పులు చేసింది. ఫాస్ట్ బౌలర్ పాట్స్‌ను తీసుకుంది. 27 ఏళ్ల ఈ పేసర్‌కు దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన రికార్డుంది. అలాగే స్పిన్ పిచ్ దృష్ట్యా షోయబ్ బషీర్‌ను కూడా ఎంపి క చేసింది.
ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లో దాదా పు అన్ని మ్యాచ్‌లూ 2 రోజుల్లో ముగిసిపోయాయి. బాక్సింగ్ డే టెస్టుకు ఆతిథ్యమి చ్చిన మెల్‌బోర్న్ పిచ్‌పైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఒక్కరోజులోనే 20 వికెట్లు పడ డం ఇరు జట్లకూ ఆమోదయోగ్యంగా లేదు. అటు ఐసీసీ సైతం మెల్‌బోర్న్ పిచ్ అసంతృప్తికరంగా అంటూ రేటింగ్ ఇచ్చిన నేపథ్యం లో సిడ్నీ పిచ్‌పైనే అందరి చూపు ఉంది. ఇది లా ఉంటే ఈ మ్యాచ్‌కు భారీ భద్రతను కల్పించారు. గత ఏడాది చివర్లో ఉగ్రవాది కాల్పులతో బోండీ బీచ్ దద్దరిల్లింది. ఆ ఘటనలో 15 మంది మృతి చెందారు. స్టేడియం దగ్గర పటిష్టమైన భద్రతా ఏర్పా ట్లు చేశారు.