04-01-2026 12:00:00 AM
68 బంతుల్లోనే శతకం
విజయ్ హజారే ట్రోఫీ
రాజ్‌కోట్, జనవరి 3 : టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా మరోసారి తన హిట్టింగ్ స్టామినా ఏంటో నిరూపించా డు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో విధ్వంసం సృష్టించాడు. ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్‌లో అదరగొట్టి న పాండ్యా తాజాగా విదర్భతో జరిగిన మ్యా చ్‌లో బరోడా తరపున బరిలోకి దిగాడు. మిగిలిన బ్యాటర్లు విఫలమైనా శతకంతో జట్టుకు మంచి స్కోర్ అందించాడు.
హార్థిక్ ఇన్నింగ్స్‌లో 39వ ఓవర్ హైలెట్‌గా నిలిచిం ది. ఆ ఓవర్ ముందు వరకూ 62 బంతుల్లో 66 పరుగులు చేసిన హార్థిక్ తర్వాత పూనకం వచ్చినవాడిలా రెచ్చిపోయాడు. గుర్జపనీత్ సింగ్ వేసిన 39వ ఓవర్లో వరుసగా 6,6,6, 6,6,4 బాది మొత్తం 34 పరుగులు సాధించాడు. దీంతో పాండ్యా 68 బంతుల్లోనే శత కం పూర్తి చేసుకున్నాడు.
ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 92 బంతులు ఆడిన పాండ్యా 8 ఫోర్లు, 11 సిక్సర్లతో 133 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 98 పరుగులు బౌండరీలు, సిక్సర్ల ద్వారానే వచ్చాయి. పాండ్యా ఒక్కటే రాణించడంతో బరోడా 50 ఓవర్లలో 9 వికెట్లకు 292 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో విదర్భ దూకుడుగా ఆడి లక్ష్యాన్ని అం దుకుంది.