26 June, 2026 | 6:45 PM

Breaking News

ఐకేపీ వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి   •   టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఆరెపల్లి రాహుల్   •   నిర్మల్ పోలీస్... మీ పోలీస్...   •   బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •  

హోల్డర్ వివాదాస్పద క్యాచ్

01-05-2026 01:54 AM

అహ్మదాబాద్, ఏప్రిల్ 30 : గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌లో ఓ క్యాచ్ విషయంలో అంపైర్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ కొట్టిన బంతిని.. బౌండరీ లైన్ వద్ద జేసన్ హోల్డర్ డైవ్ చేస్తూ అందుకున్నాడు. అంపైర్ ఔట్ అని ప్రకటించాడు. 

ఫలితంగా రజత్.. డగౌట్ వైపు నడిచాడు. అప్పటికే ఔట్ అయి డగౌట్‌లో కూర్చున్న విరాట్ కోహ్లీ.. బంతిని అందుకున్న తర్వాత తనను తాను కంట్రోల్ చేసుకోకముందే హోల్డర్.. దాన్ని గ్రౌండ్‌కు తగిలించాడని వాదించాడు. రీప్లేలు చూడగా.. హోల్డర్ చేతిలో ఉండగానే.. బంతి గ్రౌండ్‌ను తాకినట్లు కనిపించింది. దీనిపై కోహ్లీ చాలా సేపు అంపైర్‌తో మాట్లాడాడు. అప్పటికే ఔట్ అని ప్రకటించడంతో రజత్ బౌండరీ లైన్ దాటాల్సి వచ్చింది.