calender_icon.png 1 May, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

01-05-2025 01:53:40 AM

అర్మూర్, ఏప్రిల్ 30: రైతుల నుంచి వరి దాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, అర్మూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి డిమాండ్ చేశాడు. బుధవారం రోడ్లపై అరబెట్టిన దాన్యాన్ని ఆయన పరిశీలించారు.  అర్మూర్ నుంచి నిజామాబాద్ వరకు రోడ్లపైనే దాన్య రాశులు ఉండటంతో వాటిని పరిశీలించారు. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేయకపోవడం వల్ల రోడ్లపైనే కుప్పలు పడి ఉన్నాయని వాపోయారు.

ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అకాల వర్షాలకు దాన్యం నానిపోతున్నాయని వాపోయారు.ఈ విషయమై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫోన్ చేసి మాట్లాడారు. తక్షణమే దాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మూడు రోజుల్లో రైతుల వద్దనుంచి కొనుగోలు చేయాలని లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టడిస్తామని జీవన్ రెడ్డి హెచ్చరించారు. జీవన్ రెడ్డి వెంట నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.