06-09-2025 12:41:48 AM
-పరిశ్రమల స్థాపనకు రాష్ట్రప్రభుత్వం అనుకూలం
-పెట్టుబడులు పెట్టండి... రాష్ట్రపురోగతిలో పాలుపంచుకోండి
-గల్ఫ్ పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలకు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): పరిశ్రమల స్థాపనకు రాష్ట్రప్రభు త్వం అన్ని అనుకూలమని, గల్ఫ్ పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలు ‘రైజింగ్ తెలంగాణ’ లో భాగస్వాములు కావాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు పిలు పునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్రపురోగతిలో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ వీకెండ్ 2025’లో భాగంగా శుక్రవారం యూఏఈలో నిర్వహించిన సౌత్ ఇండియన్ బిజినెస్ అచీవర్స్ అవార్డుల (సైబా) ప్రదానోత్సవానికి అతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణ భారత్‌లోని ఇతర రాష్ట్రాలకూ రోల్‌మాడల్‌గా నిలుస్తున్నదని కొనియాడారు. భౌగోళిక విస్తీర్ణంలో దేశంలోనే 11వ స్థానం, జనాభాపరంగా 12వ స్థానంలో ఉందని వెల్లడించారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం కంటే ఎక్కువ అని వివరించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో జీఎస్ డీపీ వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదైందని, ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ అని స్పష్టం చేశారు. గడిచిన 18 నెలల్లో తెలంగాణ లైఫ్ సెన్సైస్, ఈవీ, ఏరోస్పేస్, లాజిస్టిక్స్, ఏఐ, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాల్లో రూ.3.28 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని వెల్లడించారు.
‘ఎలీ లిలీ’్ల లాంటి అనేక ప్రపంచ దిగ్గజ సంస్థలు తెలంగాణను తమ గమ్యస్థానంగా మార్చుకు న్నాయని, ఇప్పటికే యూఏఈ పెట్టుబడిదారులు రూ.2 వేల కోట్లకు పైగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టారని వివరించారు. ఇది తెలంగాణ. మధ్య రోజురోజుకీ బలపడు తున్న వాణిజ్య సంబంధాలకు చిహ్నం గా భావిస్తున్నామని చెప్పారు. ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్టెక్, డిజిటల్ ఎకానమీ, స్మార్ట్ మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ, లైఫ్ సెన్సైస్, లాజిస్టిక్స్, వేర్ హౌజింగ్, ట్రేడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఈవీ, ఏరో స్పేస్, డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ తదితర రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, కాబట్టి సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని మంత్రి శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు.