calender_icon.png 6 September, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంగమ్మ ఒడికి గణనాథుడు

06-09-2025 12:41:16 AM

  1. శోభ యాత్రలో పాల్గొన్న కేంద్రమంత్రి బండి

బందోబస్తులో పాల్గొన్న 867 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది

కరీంనగర్, సెప్టెంబర్ 5 (విజయ క్రాంతి): కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్లలలో నవరాత్రులు పూజలందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరారు. కరీంనగర్ వ్యాప్తంగా నిమజ్జనాలు వైభవంగా సా గాయి. ఉమ్మడి జిల్లాలో 10 వేలకు పైగా వినాయకుడి విగ్రహాలను భక్తుల కోలాహ లం మధ్య నిమజ్జనాలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు రోజుల పాటు నిమజ్జనోత్సవాలు నిర్వహించారు.

విభిన్న ఆకృతుల్లో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని వి గ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో శోభాయాత్ర ద్వారా ఊరేగించారు. పోయిరావయ్య.. పోయిరావయ్య.. బొజ్జ గణపతయ్య...మళ్లీ వచ్చే ఏడాదికి తిరిగి రావయ్యా అంటూ గణనాధుడిని నీళ్లల్లో నిమజ్జనం చేసి వీడుకోలు పలికారు. డప్పు చప్పుళ్లు, భజనలు, కోలాటం, ఒగ్గుడోలు నృ త్యాలు, డ్యాన్సులతో గణేషుడి శోభాయాత్ర సాగింది.

కరీంనగర్ లో జరిగిన గణేశుడు శోభాయాత్రలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మేయర్ సునీల్ రావు, కలెక్టర్ పమేల సత్పతి సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సీపీ గౌస్ ఆలం పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో కొలిచిన గణనాథున్ని శోభయాత్రతో తీసుకెళ్లి సమీపంలోని చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు భక్తు లు.

డీజే సౌండ్ ను పోలీసులు నిషేధించినప్పటికీ యువత మాత్రం డెక్ లు ఏర్పాటు చేసుకుని డప్పు నృత్యాలు చేశారు. గణపతి బొప్ప మోరియా.. జై బోలో గణేశ్ మహరాజ్ కీ జై.. అంటూ భక్తులు జయజయ ధ్వ నులతో బొజ్జ గణపయ్యకు బై బై గణేశా అంటూ వీడ్కోలు పలికారు. తొలి పూజలు అందుకుని విఘ్నాలను తొలగించే వినాయకుడి నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావర ణం లో వైభవంగా ముగిసింది.

- ట్రాక్టర్ నడిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ట్రాక్టర్ నడిపారు. మహాశక్తి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో బండి సంజయ్ కుమా ర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి బండి సంజయ్ స్వ యంగా గణేశ్ విగ్రహాన్ని ట్రాక్టర్ లో ఎక్కించారు. ఆ వెంటనే బండి సంజయ్ ట్రాక్టర్ ఎక్కి కొద్ది దూరం డ్రైవింగ్ చేశారు. అనంత రం టవర్ సర్కిల్ వరకు శోభాయాత్రగా కేంద్ర మంత్రి వెళ్లారు.

- శోభాయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల...

నగరంలోని పాతబజార్ హనుమాన్ ఆలయం వద్దగల ఒకటో నెంబర్ వినాయకుని వద్ద మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి శో భాయాత్రను ప్రారంభించారు. అనంతరం ఒకటవ నెంబర్ వినాయకునితోపాటు గణనాథులు టవర్ సర్కిల్ మీదుగా శోభాయా త్రగా నిమజ్జనానికి తరలాయి.

- పటిష్ట బందోబస్తు...

కరీంనగర్ లో గణేష్ శోభాయాత్ర నిమజ్జనం కోసం సి పి గౌస్ ఆలం ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దా దాపు 867 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించారు. ఈ బందోబస్తులో ఇద్దరు అడిషనల్ డీసీపీలు, ఐదు గురు ఏసీపీలు, 20 మంది ఇన్స్పెక్టర్లు, 40 మంది ఎస్‌ఐలు, 350 మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు, 100 మంది హోంగార్డులు, 150 మంది ఎన్ సి సి క్యా డెట్లు, 200 మంది వాలంటీర్లు పాల్గొన్నారు.

పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం అప్ర మత్తంగా ఉండాలని ఆదేశించారు. నగరంలోని సున్నితమైన ప్రాంతాల్లో పటిష్ట భద్ర తతో పాటు, రూఫ్టాప్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. నిఘా కోసం ఇప్పటికే మున్సిపల్ శాఖ ఏర్పాటు చేసిన 750 కెమెరాలతో పాటు, పోలీస్ శాఖ అదనంగా 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ కెమెరాల దృశ్యాలను నిరంతరం కమాండ్ కం ట్రోల్ సెంటర్ నుండి పర్యవేక్షించారు.

హిందూ.. ముస్లిం భాయి..భాయి

మానవత్వమే అభిమతంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా..మతసామరస్యానికి ప్రతీకగా, గంగా జమున తెహజీబ్ కు కేరాఫ్ కరీంనగర్ నగర వేదికగా, హిందూ-ముస్లిం భాయి భాయి అనే నినాదంతో జమ్.. జమ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 2005 నుండి ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు..

తెలంగాణ హజ్ కమిటీ సభ్యులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ తన స్వంత ఖర్చుతో హిందూ ముస్లిం సోదర భావాన్ని పెంపొందించేందుకు, మానవత్వపు పునాదిగా అద్భు తమైన సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలిస్తున్నాడు. గణేష్ నిమజ్జనం సందర్భంగా, నగరంలోని రాజీవ్ చౌక్ లో బాదం మిల్క్, మినిరల్ వాటర్, లస్సీ, గులాబ్ వాటర్ ను భక్తులకు అందించారు. ఈ స్టాల్ ను సీపీ గౌష్ ఆలంప్రారంభించారు.