6 May, 2026 | 7:45 PM

Breaking News

పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •   జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •   గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •   వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు   •   ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో ఘనంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన   •   నాగోల్‌లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల వేగం పెంచాలి   •   పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి - సిపిఐ   •   పంటల మార్పిడి విధానాన్నీ రైతులు అవలంబించాలి   •   కులర్ కరెంట్ షాక్‌తో బాలుడికి గాయాలు   •  

అప్రమత్తంగా ఉండాలి

02-09-2024 02:08 AM
  1. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు

మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివార ం ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అధికారులతో కలిసి లోయర్ మానేరు డ్యాం ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొంతకాలం గా చెరువులు, కుంటలు నిండలేదని ఆందోళన పడుతున్న నేపథ్యంలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుతున్నాయన్నారు.

మరో రెం డు రోజులపాటు వర్షాలు ఉన్నాయ ని, జిల్లాలో ప్రజలను ఖాళీ చేసే పరిస్థితి లేదని, ఎక్కడా ప్రాణనష్టం సం భవించలేదన్నారు. కోహెడ ఇల్లంతకుంట మండలాల్లో వరద కారణంగా రవాణా నిలిచిపోయిందన్నారు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో మొదలైందని, ఎల్‌ఎండీలో 24 టీఎంసీలకు ప్రస్తుతం 14 టీఎంసీలు ఉన్నాయని, మిడ్ మానేరుకు మోయతుమ్మెద వాగు, మూల వాగు నుంచి వరద వస్తుందన్నారు. ఎల్లంపల్లి నుంచి రోజువారీగా ఇప్పటికే నీటి విడుదల జరుగుతుందన్నా రు.

మిడ్‌మానేరు, లోయర్ మానే రు, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల్లో నీళ్లు నింపుకునే విధంగా వర్షా లు పడ్డాయని, అటు కిందికి కోదాడ వరకు నీళ్లు అందించవచ్చన్నారు. వర్షాలపై అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని తెలిపారు. అక్కడక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ క్లియర్ చేస్తున్నామని, అధికారులందరూ క్షేత్రస్థాయిలో ఉండి నిరంతనం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ ప్రాజెక్టుల్లో గరిష్ఠ స్థాయి నిండే పరిస్థితి ఉందని, కాళేశ్వరం టెక్నికల్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారమే నీటి నిల్వ కొనసాగుతుందన్నారు.

ఎల్లంపల్లి నుంచి ప్రతి చుక్క ఉపయోగించుకునే విధంగా ప్రాజెక్టుల్లో కి పంపిస్తామన్నారు. శ్రీరాంసాగర్‌లో ప్రస్తుతం 64 టీఎంసీలు ఉన్నాయని, పూర్తిస్థాయి నిండగానే వరద కాలువ ద్వారా నీటిని విడుదల జరుగుతుందన్నారు. రాబోయే కాలంలో వ్యవసాయానికి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడిక్కడ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని చర్యలు తీసుకోవాలన్నారు.