ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ లక్ష్యం
- ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాం
- నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నం
- నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం
- ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభు త్వ కర్తవ్యమని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వరద పరిస్థితుల నేపథ్యంలో విపత్తు నిర్వహణ కార్యాలయంలో ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మాట్లాడు తూ కాజా టోల్‌గేట్, జగ్గయ్యపేటలో ముంపు ఎక్కువగా ఉందన్నారు.
విజయవాడ, గుంటూరులో 37 సెం.మీ వర్షం కురవడం అసాధారణ మని, అందుకే ముంపు ప్రాంతాల సంఖ్య పెరిగిందని, సహాయక చర్యలు చేపట్టామన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. వర్షాలు, వరదల్లో 9 మంది ప్రాణాలు కోల్పొయారని, ఒకరు గల్లంతయ్యారన్నారు. కొండ చరియలు విరిగిపడటం, వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధకరమన్నారు. పులిచింతల నుంచి ప్రవాహం వేగంగా వస్తోందని, ప్రకాశం బ్యారేజీకి 8.8 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోందని, బుడమేరతో వీటీపీఎస్‌లో విద్యుదుత్పత్తి నిలిచిపోయిందన్నారు.
ప్రకాశం బ్యారేజీ కింద పలు చోట్ల గట్లు బలహీనంగా ఉన్నాయని, అక్కడ ఇసుక బస్తాలు వేస్తున్నట్లు తెలిపారు. వానలకు పంటలు బాగా దెబ్బతిన్నాయని, రాష్ట్ర వ్యాప్తం గా 107 క్యాంపులు, పెట్టామని, 17 వేల మందిని తరలించామని, ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. వరద ముంపు ప్రాంతాలకు బోట్లు పంపించామ న్నారు. వరద ప్రాంతాల్లో బాధితులకు బియ్యం, పప్పు, నూనె, పంచదార, కూరగాయలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారుల కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేస్తున్నామన్నారు.
లక్షమందికి ఆహారం..
విజయవాడలో బుడమేర మునక ప్రాంతం లో సహాయక చర్యలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పాలు, ఆహారం, నీళ్లు, కొవ్వొత్తులు, టార్చ్‌లను వెంటనే అన్ని ప్రాంతాల నుంచి తెప్పించాలని అధికారులకు ఆదేశించారు. లక్ష మందికి సరిపోయేలా ఆహారం సరఫరా చేయాలని, ఇతర ప్రాంతాల నుంచి అదనపు బోట్లు, ట్రాక్టర్లు తక్షణం తెప్పిం చాలని సూచించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, అందుబాటులో ఉన్న ఫ్యాక్డ్ పుడ్ బాధితులకు ఇవ్వాలని పేర్కొన్నారు.






