calender_icon.png 6 July, 2025 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాకాలం అప్రమత్తంగా ఉండాలి

03-07-2025 12:25:56 AM

గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): వర్షాకాలం దృష్ట్యా హైడ్రా, మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు అప్రమత్తంగా ఉండాలని గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ సూచించారు. నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్ల పై వరద నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే ఫిర్యాదు మేరకు  గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ అశోక్ నగర్ సిటి సెంట్రల్ లైబ్రెరీ లేన్, అశోక్ నగర్ 1, 2  స్ట్రీట్ లలో పర్యటించారు.

కార్పొరేటర్  సూచనల మేరకు అశోక్ నగర్ లో వరదనీటిని తొలగించేందుకు హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ చేపట్టిన పనులను బుధవారం   అధికారులు, బీజేపీ నాయకులతో కలసి కార్పొ రేటర్  పర్యవేక్షించారు. హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ సిబ్బంది వర్షాకాలం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా వుండాలని, డివిజన్‌లో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, జిహెచ్‌ఎంసి అసిస్టెంట్ ఇంజనీర్ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్, హైడ్రా ఎమర్జెన్సీ టీమ్ సిబ్బంది, బీజేపీ నాయకులు శ్రీకాంత్, ఎం. ఉమేష్, ఆకుల సురేందర్, సురేష్, ఆనంద్ రావు, సాయి కుమార్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.