calender_icon.png 7 July, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలమండలి ఉద్యోగుల అభ్యున్నతికి సీఎం రేవంత్‌రెడ్డి కృషి అభినందనీయం

03-07-2025 12:27:27 AM

ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగుళ్ళ రాజిరెడ్డి

ముషీరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): మెట్రో వాటర్ వరక్స్  అండ్ సేవరజ్ బోర్డు లో ఐ.ఎన్.టి.యు.సి కాంగారు యూనియన్ వినతి మేరకు ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి, జలమండలి ఎండి అశోక్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చి అనేక సంవత్సరాలుగా పెండింగ్ లోఉన్న జలమండలి ఉద్యోగుల సమస్యలు పరిష్కరానికి కృషి చేయడాన్ని ఐ.ఎన్.టి.యు.సి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, హెచ్‌ఏండబ్ల్యూడబ్ల్యూ అండ్ ఎస్.బి  కాంగారు యూనియన్ అధ్యక్షులు మొగుళ్ళ రాజి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్ లో బుధవారం ఇటీవలే జలమండలిలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, ప్రమోషన్లు పొందిన ఉద్యోగులు వారి సమస్యలను పరిష్కరించినందుకు మొగుళ్ళ రాజి రెడ్డికి శాలువా, ఫూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడు తూ జలమండలి ఉద్యోగుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి అభినందనీయం అని, కాంగ్రెస్ ప్రజాపాలన కు జలమండలి ఉద్యోగుల సమస్యల పరిస్కారమే ఇందుకు నిదర్శనమన్నారు.

ఉద్యోగ సమస్యలపై  అవగాహన కలిగిన కాంగారు యూనియన్ బలమైన నాయకత్వంవల్లే వారి సమస్యలు వేగంగా పరిష్కరమవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి సి. హెచ్. సురేష్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కె. రామరాజు, నాయకులు కె. రమణా రెడ్డి, రఘునాథ్, నరేందర్, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.