06-07-2025 04:43:58 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ విద్యార్థి మహారాష్ట్ర పూణేలో గల భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ క్రికెట్ అకాడమీ(Cricket Academy Of Pathans)లో క్యాప్ స్కాలర్ షిప్ కోసం ఎంపికయ్యాడు. బెల్లంపల్లిలో అశోక్ నగర్ కు చెందిన రెడ్డి రిత్విక్ పూణేలోని భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ క్రికెట్ అకాడమీలో జరిగిన అండర్ 14 ట్రయల్స్ లో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి క్యాప్ స్కాలర్ షిప్ కోసం ఎంపికయాడు. ఇందుకోసం రిత్విక్ మూడు క్రికెట్ మ్యాచ్ లను ఆడవలసి ఉంటుంది. ఈ మ్యాచ్ లలో రిత్విక్ ప్రతిభ కనబరిస్తే స్కాలర్ షిప్ పొందడానికి అర్హత సాధిస్తాడు. ఈ స్కాలర్ షిప్ దాదాపు రూ.2లక్షల వరకు ఉంటుంది. రిత్విక్ బెల్లంపల్లిలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు.