calender_icon.png 7 July, 2025 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్యవైశ్యులు సమాజసేవలో రాణించినప్పుడే గుర్తింపు

06-07-2025 05:03:22 PM

ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాటికొండ సీతయ్య..

తుంగతుర్తి (విజయక్రాంతి): ఆర్యవైశ్యులు సమాజ సేవలో రాణించినప్పుడే గుర్తింపు లభిస్తుందని ఆర్యవైశ్య మహాసభ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాటికొండ సీతయ్య(District Vice President Tatikonda Seethaiah) అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో గౌరవ మాజీ అధ్యక్షులు ఓరుగంటి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆర్యవైశ్య మండలం మహాసభ సంఘం నూతన కమిటీ వాసవి క్లబ్ నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గంలో ఆర్యవైశ్య సంఘం మహాసభ మండల అధ్యక్షుడు ఈగ నాగన్న ప్రధాన కార్యదర్శి గుండా శ్రీనివాస్ కోశాధికారిగా మాశెట్టి వెంకన్న వాసవి క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శిగా బండారు శేషు కోశాధికారిగా తల్లాడ శ్రీనివాసులను ఎన్నుకొని శాలువాలతో ఘనంగా సన్మానించారు.

అనంతరం పలువురు మాట్లాడుతూ... ఆర్యవైశ్య సంఘం అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. రానున్న రోజుల్లో రాజకీయ పదవుల పోటీలో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండారు దయాకర్ ,గుమ్మడవెల్లి సోమన్న, తల్లాడ కేదారి, ఈగ లక్ష్మయ్య పోలవరపు సంతోష్, ఓరుగంటి అంతయ్య, గోపారపు సత్యనారాయణ బుద్ధ వీరన్న, ఈగ మల్లయ్య ,ఈగ శ్రీను కృష్ణమూర్తి తాప్సి ఆనంద్, తల్లాడ నారాయణ, తల్లాడ శ్రీను బండారు సోమన్న తదితరులు పాల్గొన్నారు.