calender_icon.png 7 July, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

06-07-2025 05:06:05 PM

బెజ్జూర్ (విజయక్రాంతి): బెజ్జూర్ మండల(Bejjur Mandal) కేంద్రంలోని సహకార సంఘం ఆవరణలో అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా ఏక్ పెడ్ మాకే నామ్ అనే నిదానంతో మొక్కలు నాటారు. సహకార సంఘం చైర్మన్ ఓం ప్రకాష్ మాట్లాడుతూ... సహకార సంఘం కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటినట్లు తెలిపారు. నాటిన ప్రతి మొక్కను కాపాడుట అందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఇన్స్పెక్టర్ వట్టేపల్లి మునీశ్వరి, డైరెక్టర్ శ్రీ వర్ధన్, కార్యదర్శి జక్కుల సత్యనారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ కొండ్ర జగ్గా గౌడ్, భూష శంకర్, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.