calender_icon.png 28 November, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

11-02-2025 11:13:45 PM

జిల్లా అధికారులకు అవగాహన కార్యక్రమంలో డీఆర్వో వెంకటాచారి...

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారి ఈ.వెంకటాచారి అన్నారు. సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘సైబర్ నేరాలు సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం’ అనే అంశంపై ఎన్‌ఐసీ అధికారి వంశీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగంపై అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, సూపరిండెంట్లు, సిబ్బంది, ఐటీ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.