28-11-2025 01:22:34 AM
- తొలిరోజు సర్పంచ్ స్థానాలకు పోటీపోటాగా నామినేషన్లు
కరీంనగర్, నవంబరు 27 (విజయ క్రాంతి): గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమయింది. కరీంనగర్ ఉమ్మడి జి ల్లా పరిధిలోని కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా గ్రామాల్లో స ర్పంచ్ స్థానాలకు పోటీ చేయాలనుకున్న అ భ్యర్థులు బలప్రదర్శనతో నామినేషన్ వేసేందుకు కేంద్రాలకు వచ్చారు. మొదటి రోజు నామినేషన్లు ప్రశాంతంగా దాఖలయ్యాయి.
జగిత్యాల జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరగనున్న 122 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ స్థానాలకు 48 నామినేషన్లు,1172 వార్డు స్థానాలకు 33 నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్ జిల్లాలో మొదటి విడ తలో ఎన్నికలు జరగనున్న 92 సర్పంచ్ స్థా నాలకు 92 నామినేషన్లు, 866 వార్డులకుగాను 86 నామినేషన్లు దాఖలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 85 పంచాయతీలలో సర్పంచ్ స్థానాలకు 42 నామినేషన్లు, 748 వార్డు స్థానాలకు 32 నామినేషన్లు దాఖలయ్యాయి.
పెద్దపల్లి జిల్లాలో 99 పంచాయతీలలో సర్పంచ్ స్థానాలకు 76 నామినేషన్లు, 896 వార్డు స్థానాలకు 37 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల విధులను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వ హించేందుకు ఆయా జిల్లాల నియమితులైన ఎన్నికల పరిశీలకులు, వ్యయ పరిశీలకులు గురువారం పర్యటించి ఆయా జిల్లా కలెక్టర్లతో కలిసి నామినేషన్ల ప్రక్రియను పరిశీ లించారు.
ఎన్నికల వ్యయ వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని, నగదు జప్తు చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పరిశీలకులు సూచించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతోసమీక్షించారు.