calender_icon.png 28 November, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెక్‌డ్యాం ఘటనపై బీఆర్‌ఎస్ అసత్య ప్రచారాలు చేస్తోంది

28-11-2025 01:21:28 AM

బీఆర్‌ఎస్ హయాంలో మానేరును బీఆర్‌ఎస్ నాయకులు చెర పట్టారు  : ఒడితల ప్రణవ్

హుజురాబాద్, నవంబర్ 27:(విజయ క్రాంతి) తనుగుల చెక్ డ్యాం ధ్వంసం ఘటనపై బీఆర్‌ఎస్ అసత్య ప్రచారాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితెల ప్రణవ్ బాబు విమర్శించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కేంద్రంలోని జమ్మికుంట పట్టణంలో వినాయక గార్డెన్స్ లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాధనాన్ని ఎవరు దుర్వినియోగం చేసిన ఊరుకోమని హెచ్చరించారు. ఘటనపై విచారణ కొనసాగుతుందని, మరో నాలుగైదు రోజుల్లో ఎఫ్ ఎస్‌ఎల్ రిపోర్ట్, పూర్తిస్థాయి నివేదికరాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రణవ్ తెలిపారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రెచ్చిపోవడానికి ప్రధాన కారణం బిఆర్‌ఎస్ పార్టీ నాయకులని అన్నారు.

చెక్ డ్యాం పేల్చివేతకు గురైతే దాని ఆనవాళ్లు చుట్టుపక్కల పరిసరాల్లో ఉంటాయని, చిన్న పటాకా పేలిస్తేనే చల్లాచదరవుతాయని, అలాంటిది ఇంత పెద్ద చెక్ డ్యాం పేల్చారని ఆరోపణ చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు వాటి ఆనవాళ్లు చూపిం చడం లేదని అన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజ య రమణారావు విసిరిన సవాల్ కు కౌశిక్ రెడ్డి స్పందించడం హాస్యాస్పదమని, కాంక్రీట్ కి,గుండు రాయికి తేడా తెలవని కౌశిక్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు చెప్పినట్టుగా జిలెటిన్ స్టిక్స్ పెడితే కాంక్రీట్ లో జిలిటెన్ ఆనవాళ్లు ఉంటాయా లేక కుంగిన ప్రదేశం నుండి దూ రంగా ఉన్న బండరాళ్లలో ఉంటాయా అని ప్రశ్నించారు.

తాము పరిశీలించినప్పుడు అక్కడ ఎలాంటి ఆనవాళ్లు కనబడలేదని అన్నారు. కౌశిక్ రెడ్డి మెదడు సరిగా పనిచేయదని అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడు తున్నాడని అన్నారు. నాసీరకమైన నిర్మా ణం, కమీషన్ల కక్కుర్తి కోసం నిర్మాణాలు చేపట్టడం ద్వారానే ఇలాంటి నష్టం జరిగిందని, ఇసుకపై నిర్మాణం చేపట్టడం వలన ఇంతటి అనర్థం జరిగిందని, గతంలో 2022 లో కూడా ఈ చెక్ డ్యాం కుంగిందని ఇక్కడి రైతులే చెప్తున్నారని అన్నారు. దీంతోపాటు విలాసాగర్, తనుగుల, మల్లారెడ్డిపల్లి, పెద్దపల్లి జిల్లాలోని నాలుగు చెక్ డ్యాంలు ఆనా డు కూలిపోయాయని అన్నారు.

నీటి పారుదల శాఖలో ఐదేళ్ల అనుభవం ఇదేనా హరీష్ రావు?

ఐదేళ్లపాటు నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన హరీష్ రావు, కౌశిక్ రెడ్డి మాయలో పడ్డారని అన్నారు. హరీష్ రావు ను రాజకీయం నుండి రాజీనామా వరకు కౌ శిక్ రెడ్డి తీసుకొచ్చారని ప్రణవ్ ఎద్దేవా చేశారు. హరీష్ రావుతో పాటు అక్కడ ఉన్న మాజీ మంత్రి గంగుల కమలాకర్ కి కూడా ఈ విషయంపై అవగాహన ఉందని అందుకే అక్కడ ఏం మాట్లాడలేదని అన్నారు. గుంపు ల రామభద్ర స్వామి సాక్షిగా బీఆర్‌ఎస్ పార్టీ అబద్ధపు ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు.

మరోవైపు కౌశిక్ రెడ్డి బోగస్ ప్రచారా లు చేస్తాడని,అబద్ధాలు చెప్పడంలో బీఆర్‌ఎస్ పార్టీకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చని అన్నా రు. ఈ కార్యక్రమంలో పీసిసి సభ్యులు పత్తి కృష్ణారెడ్డి,జమ్మికుంట పట్టణ,మండల అధ్యక్షులు రమేష్,పరశు రామ్,మహిళా అధ్యక్షు రాళ్ళు రేణుక,స్వప్న,సీనియర్ నాయకులు గుడెపు సారంగపాణి,ఆరుకాల వీరేశలింగం, పొనగంటి మల్లయ్య,దేశినీ కోఠి,సదానం దం, శివ,సలీం, శ్రీను, రామస్వామి మాజీ కౌన్సిలర్లు,యూత్ కాంగ్రెస్ నాయకులు,మైనారిటీ నాయకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలోపాల్గొన్నారు.