calender_icon.png 28 November, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి కల్పన, సంక్షేమం నుంచి సింగరేణి యూటర్న్

28-11-2025 12:00:00 AM

  1. యువత భవిష్యత్ అంధకారం ?

లాభాల కోసం మల్టీ వ్యాపారంపై ఆరాటం

సింగరేణి మనుగడకు చుక్కెదురు

బెల్లంపల్లి అర్బన్, నవంబర్ 27: తెలంగాణకు కొంగుబంగారమని మురిసిపోతున్న సింగరేణి నిర్వహణ కంపెనీ యూటర్న్ వైపు అడుగులు వేస్తుంది... ఇది యావత్ సింగరేణి లోకానికి షరాఘాతం. కార్మికులను దిగ్బ్రాంతికి గురి చేస్తోంది... ఉపాధి ఉత్పత్తి, సింగరేణి మనుగడ, కార్మిక సంక్షేమం లక్ష్యం గాడి తప్పుతోంది. ఇప్పటికే ఆ వైపునకు దారులు పడ్డా యి. అండర్ గ్రౌండ్ బొగ్గు గనులతో భారీగా నష్టాలు వస్తున్నాయనే నెపంతో తొలుత రామగుండం ఏరియాలో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులకు పెద్దపీట వేశారు. ఆ తర్వాత క్రమంగా సింగరే ణి వ్యాప్తంగా ఓపెన్ కాస్ట్‌లను విస్తరింపజేశా రు.

వాటితో కూడా సంస్థకు అనుకున్న ఉత్పత్తి లాభాలు రావడం లేదని, వాదనలను తెరపై పెట్టారు. వార్షిక నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించుకోలేకపోతున్నామని, తామను కున్న ప్రత్యామ్నాయ మార్గం వైపు దృష్టి మళ్లించే వ్యూహం పన్నారు. దీనిని ప్రచారంలో పెడుతూనే మరోవైపు లాభాల కోసమని, ముఖ్యంగా సింగరేణి కంపెనీ పరిరక్షణ కోసమని బహుళ వ్యాపారాల వైపు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటి వరకు సింగరేణి నష్టాలకు తారక మంత్రంగా, సింగరేణి మనుగడకు ప్రధానమనుకున్న ఓపెన్ కాస్టులు కూడా పనికి రాకుండా పోతున్నాయి.

లాభా ల్లో లక్ష్యాల సాధనలో ఎలాంటి పురోగతి లేదు. సింగరేణిలో ఓసీలకు చెల్లుచీటీ మరెంతో కాలం లేదని స్వయంగా సీఎండీ సెలవిచ్చారు. లాభాల కోసం మరోదారి వెతుకుతున్నారు. ఇక అన్ని అయిపోగా యాజమాన్యం మరో వ్యాపారం వైపు చూస్తోంది. ఇలా ఎప్పటికప్పు డు చేత చేయూతనివ్వని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటుంది. సింగరేణి నష్టాలకు కారణమైన సమస్యకు పరిష్కారం కను గొనకుండా ‘పుండోకాడ ఉంటే మందు మరొకాడ పెట్టినట్టు‘ ప్రత్యామ్నాయం పేరిట సింగరే ణి సంస్థను అధికారులు భ్రస్టు పట్టించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సరైనా ప్రత్యామ్నాయ పరిశ్రమలైనా విద్యుత్తు ఉత్పత్తి కం పెనీలు, సోలార్ పవర్ ప్రాజెక్టుల దిక్కూ వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలోనే సిం గరేణి యాజమాన్యం మల్టీఫ్లెక్స్, పెట్రోల్ బంకులు, ఇతర వ్యాపారాల వైపు లాభాల కోసం ఆగమే ఘాల మీద కసరత్తు చేస్తోంది. బొగ్గు ఆధారిత పరిశ్రమలను తక్కు వ చూస్తూ.. కేవలం లాభాపేక్షనే సింగరేణి యాజమాన్యం ఆశిస్తోంది. సింగరేణి మనుగడ, దానిపై ఆధారపడిన కోల్ బెల్ట్ ప్రజా నీకం, ఉపాధిని అసలు పరిగణలోకి తీసుకోవ డం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి.

బొగ్గు మార్కెట్లో ఎలా పోటీలో నిలబడాలనే యావే తప్ప  సింగరేణి ముందు మరోక అభివృద్ధి దాయాక విధానమే కనిపించడం లేదు. లాభా లు ఒకవైపు, ఉపాధి మరో వైపుగా బహుళ లక్ష్యంతో సింగరేణి కంపెనీ కించెత్తు యోచనా చేయడం లేదు. 

సింగరేణి సిరుల తల్లిని ఇప్పటికే ప్రైవేటు శక్తుల్లో బంధించేసి సింగరేణి బిడ్డలను ఆనాథలుగా మార్చేశారు. ఇక అది సరిపోనట్టు.. సింగ రేణిని పూర్తిగా ఎడారిగా మార్చే ప్రయత్నాల కు, అభివృద్ధి, సింగరేణి మనుగడ ముసుగు లో నూతన విధానాలకు పదును పెడుతున్నా రు. అండర్ గ్రౌండ్ గనులను తీసుకొస్తే నష్టా లు వస్తున్నాయని చెప్తున్నారు.

నష్టం వచ్చినా ప్రజలకు మేలు చేసే భూగర్భ గనుల మేలును ఎందుకు విస్మరిస్తున్నారనే ప్రశ్నలు కార్మికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. సంస్థ మనుగడను లాభాల్లోకి తీసుకువెళ్లి, సింగరేణి ఎడారీ చేసి ప్రజలకు ఉపాధి లేకుండా.. నిర్వాసితులను చేసి సాధించే లాభాలు ఎవరి కోసం..? అనే వాదనలు వినిపిస్తున్నాయి. సింగరేణి ఉపాధి రంగాన్ని దెబ్బతీసే ఆ లాభాల వల్ల కలిగే ప్రయోజనం నిజమైందేనా..?

ప్రజలకు సింగరేణి ప్రాంతీయులకు నష్టం చేసేదీ ఎలా లాభదాయకమైన విధానం అవుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి... సామాజిక ఉపాధికీ ఏకైక రంగం సింగరేణి కంపెనీనే. లాభాల పేరిట ఖనిజ సంపదను కొల్లగొట్టడమే అటు ప్రభుత్వం.., ఇటు సింగరేణి యాజమాన్యం చెబుతున్న అభివృద్ధిని సామాజిక వేత్తలు తప్పు పడుతున్నారు.

పదేళ్లుగా ఒక్క గని రాలే...

సింగరేణిలో పురాతన గనులు మూతబడిపోవడం, వాటి స్థానంలో కొత్తగా భూగర్భ గనులు రాకపోవడం, అందుకు కృషి చేయకపోవడంలోనే నష్టదాయకమైన విధానం దాగి ఉంది. సింగరేణి వందల కొద్ది భూగర్భ గనులకు నెలవుగా ఉండేది. ఒకప్పుడు లక్ష 20 వేల మంది కార్మికులు ఉండేవారు. 1991లో ఎప్పుడైతే సింగరేణిలో ప్రవేశించిన నూతన ఆర్థిక విధానాలు సింగరేణి పరిశ్రమ, కోల్ బెల్ట్ ప్రజానీకం భవిష్యత్తుకు గొడ్డలి పెట్టయ్యాయి.

ఈ విధానాలు అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో శ్రీకారం చుట్టాయి. నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు సింగరేణినీ పారిశ్రామికంగా దివాళా తీశాయి. ఈ క్రమంలోనే సింగరేణి తీవ్ర నష్టాలకు గురై బిఐఆర్‌ఎఫ్ మృత్యు ముఖంకు వెళ్లి అనూహ్యంగా తిరిగి వచ్చింది. ఈ పరిణామాలను అటు ప్రభుత్వాలు ఇటు సింగరేణి యాజమాన్యం గుణ పాఠంగా తీసుకోలేదు. తమ విధానాల నుంచి జరిగిన తప్పులు ఆచరణాత్మకంగా రుజువైనప్పటికీ యజమాన్యం, ప్రభుత్వం కళ్లు తెరవలేదు.

ఫెయిల్యూర్ విధానాల పాలసీ లో నేటికీ సింగరేణి యాజమాన్యం పయనిస్తోంది. ఫలితంగా కోల్ బెల్ట్‌లోనీ పురాతన ఎల్లందు, కొత్తగూడెం, రామగుండం, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి, గోలేటి  పారిశ్రామికంగా ఒక వెలుగు వెలిగినా ప్రాంతాల్లో చీకట్లు  అలుముకున్నా యి. భూగర్భగనులు, ఓపెన్ కాస్ట్‌లతో నడుస్తున్న మణుగూరు, భూపాలపల్లి, సత్తుపల్లి, కోయగూడ వంటి ప్రాంతాలు వెరసి మొత్తం సింగరేణి భవిష్యత్తు ప్రమాదపు టంచుల్లో ఉన్నదనేది నిర్వివాదంశం. 

అండర్ గ్రౌండ్ గనులే సంజీవని...

సింగరేణి మనగడకు ఓపెన్ కాస్ట్లు, యాం త్రిక,  ప్రైవేటుకరణ విధానాలు ఎప్పటికీ అరిష్టమే. ఇదే విషయం గత 20 ఏళ్లుగా నిరూ పితం అవుతూనే ఉంది. అండర్ గ్రౌండ్ భూగ ర్భ గనులే జీవకర్ర అని నాటి నుంచి సింగరేణి ప్రగతి, ఉపాధి కల్పనకు ప్రధాన భూమికగా నిలిచిన సత్యం విస్మరించరానిది. ఆధునిక టెక్నాలజీతో భూగర్భ గనులను కూడా నిర్వహించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

యాజమాన్యమే వ్యయ భారం సాకుతో ఆ పద్ధతులను కాలదనుకున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగానే ప్రస్తుత సింగరేణి ఈ దుస్థితికి  చేరిందని కార్మికులు వాపోతున్నారు. ఈ సంక్షోభం నుంచి సింగరేణి సంస్థను గట్టెక్కించి, పూర్వ వైభవం భూగర్భ గనుల ఉత్పత్తి విధానంతోటేనని నిపుణులు సూచిస్తున్నారు. భూగర్భ గనుల పునర్ ప్రవేశం, సింగరేణిలో నెలకొన్న ప్రధాన నిరుద్యోగం, సంస్థ మనుగడకు రక్షణోపాయంగా ఆదుకుంటుందని విశ్లేష కులు భావిస్తున్నారు. సింగరేణి ప్రాణం ఇందులోనే ఉందనే ఆశాభావం కార్మికుల్లో ప్రబ లంగా వ్యక్తమవుతుంది.

ఈ దిశగా ప్రభుత్వం, యజమాన్యం ఆలోచించి భూగర్భ గనులకు మరోసారి నాంది పలకాలనీ యువకులు  కోరుతున్నారు. బొగ్గు నిక్షేపాలు ఉండీ అర్ధాంతరంగా కొందరు అధికారుల అనాలోచిత విధానాల వల్ల మూసివేత కు గురైన భూగర్భ గనుల్లో నిక్షిప్తమైన బొగ్గు నిక్షేపాలను వినియోగించుకోవడంపై దృష్టి సారించాలి. మూసివే సిన భూగర్భ గనులను ఓపెన్ కాస్టులుగా మార్చే ప్రయత్నాలను విరమించి, అండర్ గ్రౌండ్ గనులుగానే అభివృద్ధి చేయాలన్న డిమాండ్ చిరకాలంగా వ్యక్తమౌతుంది.

ఈ అంశాన్ని ప్రధానం చేసుకొని యజమాన్యం సింగరేణి సంక్షేమం కోసం పునరాలోచన చేయాల్సిన ఆవశ్యతను గుర్తించాలి. మరోవైపు బొగ్గు ఆధారిత పరిశ్రమలను నెలకొల్పుటపైన దృష్టి సారించాలి. ఇదే క్రమంలో సింగరేణి ప్రతిపాదనలో ఉన్న అండర్ గ్రౌండ్ గనులను ప్రారంభించాలి. ప్రతిపాదనలో ఉన్న గనులను వెంటనే చేపట్టాలన్న డిమాండ్ ఇప్పటికే ఉంది. 

బెల్లంపల్లి పరిధిలోని నెన్నెల మండలం శ్రావణపల్లి అండర్ గ్రౌండ్ గనితో పాటుగా బెల్లంపల్లిలో మూత పడిన సౌత్ క్రాస్ కట్, 85, 65, 68, ఇంక్లైన్ - 2, బోయపల్లి గనులపై దృష్టి పెట్టాలనీ కోరుతున్నారు. కాలనీలకు విఘాతం కలగకుండా షాప్ సిస్టంతో ఈ గనుల్లో బొగ్గు ఉత్పత్తినీ సద్వినియోగం చేసుకోవచ్చు.

కాగా పురాతన గనులకు తోడుగా కొత్త గనులను సరికొత్త టెక్నాలజీ విధానం, సింగరేణి సంస్థ ప్రస్తుత నష్టాల ఊబి నుంచి  బయటపడేందుకు ఎంతగానో దోహద పడుతుందని నిపుణులు అంటున్నారు. వీటికి అను బంధంగా బహుళ వ్యాపార విధానాలను  సం క్షేమ కోణంలో అమలు చేస్తే సంస్థ పురోగతికి అదనపు ప్రయోజనకరంగా ఉంటుంది.

గాడి తప్పిన సింగరేణిపై సంఘాల నిర్లక్ష్యం...

యాజమాన్యం విధానాల వల్ల  సింగరేణి కంపెనీ ప్రధాన స్రవంతి నుంచి వైదొలుగుతుందనే ఆందోళన సింగరేణిలో కనిపిస్తోంది. ఈ పరిస్థితి పారిశ్రామిక విధ్వంసాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ క్రమంలో సింగరేణి కార్మిక సంఘాలు, ప్రధానంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్ వంటి ప్రత్యక్ష, పరోక్ష అధికార, జాతీయ సంఘాల మౌనమే సింగరేణి గడ్డు పరిస్థితికి చేర్చిందన్న విమర్శలు ఉన్నాయి.

ప్రభుత్వాలు, యాజమాన్యం తీసుకుంటున్న సింగరేణి ప్రగతి వ్యతిరేక విధానాలను, అడ్డుకోవడంలో చిత్తశుద్ధినీ కోల్పోయాయి. కనీసం సంఘాల నుంచి ప్రయత్నం కూడా లేదు. సింగరేణి సంస్థ మనుగడ వినాశనానికి యజమాన్యం విధానాలు ఎంతమేరకు కారణమో, వాటినీ అడ్డుకోలేకపోవడం, స్వాగతిస్తున్నట్లు చేతులెత్తేసినా కార్మిక సంఘాలన్నీ కూడా అంతే కారణమని విమర్శలు బహాటంగా వినిపిస్తున్నాయి.

సింగరేణి ఉంటుందా..?

తెలంగాణకు అన్నపూర్ణ వంటి సింగరేణి సంస్థ అంపశయ్యకు చేరువలో ఉన్న సింగరేణి పరిరక్షణ, కోల్ బెల్ట్ ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులకు బాధ్యత లేదా? ఏమి చేస్తున్నారనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆరు జిల్లాల్లో 11 ఏరియాలుగా సింగరేణి విస్తరించింది. సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచి ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులు ఇలా ప్రేక్షకులుగా ఉండి పోవడం క్షంతవ్యంకాదు.

ఇదిలా ఉండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి పరిశ్రమ సింగరేణి. కాగా రాష్ట్ర ప్రభుత్వం (సింగరేణి) వాటా 51, కేంద్ర ప్రభుత్వ వాటా 49 శాతం ఉమ్మడి ప్రభుత్వాల ఆధీనంలో కొనసాగుతున్న సంగతి విధితమే. కాగా రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ కింద ఉన్న సింగరేణి సంస్థలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో సింగరేణి కంపెనీ భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారింది.

సింగరేణి మనుగడ సంక్లిష్టంగా మారింది. అస్సలు సింగరేణి ఉంటుందా? అనే  అనుమానాలు సింగరేణి కార్మికులు తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉపాధి కల్పవల్లి సింగరేణి సంస్థను ప్రగతి మార్గంలో తీర్చిదిద్ది, ఎప్పటిలాగే ఉపాధి కల్పించే మార్గాలను ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం చేపట్టాలని, ఈ దిశగా కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధులు ఇకనైనా మేల్కొనాలి.