calender_icon.png 19 October, 2025 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

17-10-2025 12:00:00 AM

వెంకటాపురం(నూగూరు), అక్టోబర్ 16 (విజయక్రాంతి) : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాతా శిశు సంరక్షణ వైద్యాధికారి భాస్కర్ పిలుపునిచ్చారు. గురువారం నూగూరు సబ్ సెంటర్ పరిధిలోని చిన్న గంగారం, మహేదాపురం గ్రామాల్లో వైద్య శిబిరం నిర్వహించారు.  గ్రామాలలో గ్రామస్తులకు వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని గ్రామస్తులకు సీజన్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు.

గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి గర్భవతులు, బాలింతలకు వైద్య పరీక్షలు చేశారు. మధుమేహం. రక్తపోటు వంటి వ్యాధిగ్రస్తులకు నెల వారి మందులు ఇచ్చారు. జ్వరం ఉన్నవారికి రక్తపుత సేకరణ, ఆర్డిటి నిర్ధారణ పరీక్షలు చేయటం జరిగింది.

బాలింతలకు, తల్లులకు  వ్యాధి నిరోధక టీకాలు తప్పక వేపించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాత శిశువు సంరక్షణ వైద్యధికారి భాస్కర్, హెచ్ ఇ ఓ కోటిరెడ్డి, స్టాఫ్ నర్స్ స్వప్న, హెల్త్ అసిస్టెంట్ రాఘవులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి టీచర్, గ్రామస్తులు పాల్గొన్నారు.