calender_icon.png 19 October, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లను ప్రారంభం

17-10-2025 12:00:00 AM

బచ్చన్నపేట, అక్టోబర్ 16 (విజయక్రాంతి) ః మండలంలోని వివిధ గ్రామాలలో ఐకేపి   సెంటర్ల తో పాటు పిఏసీఎస్ సెంటర్లను ప్రారంభించిన చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లనాగుల శ్వేత వెంకన్న. అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని వరి కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా కొనుగోలు జరపాలని రైతులను ఎవరైనా ఇబ్బందులు పెడితే వెంటనే సమాచారం ఇవ్వాలని ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేదే లేదన్నారు.

అలాగే ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద తూకాలు తేమ శాతం కొలిచే పరికరాలు సక్రమంగా పనిచేయని చెల్లింపులు సమయానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి రైతు కష్టం ఫలించేలా చర్యలు కొనసాగుతున్నాయని రైతులు సంతోషంగా ఉండడమే తెలంగాణ అభివృద్ధి కి మూలమన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు,  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రైతులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు