calender_icon.png 29 October, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోళ్లలో జాగ్రత్త

29-10-2025 12:02:59 AM

రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): మొంథా తుఫాన్ దృష్టిలో పెట్టుకొ ని ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులు ఇబ్బంది పడకుండా అధికారులు కొనుగోళ్లలో వేగం పెంచాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సూచించారు. రాష్ర్టంలో ధాన్యం సేకరణ, ఏర్పాట్లు, ఇతర సదుపాయాలపై పౌరసరఫరాల శాఖ అధికారి ప్రొక్యూర్మెంట్ జీఎం నాగేశ్వర్‌రావును రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు కేవీఎన్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రానికి వచ్చే ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా తూకం వేయాలన్నారు. అదేవిధంగా లారీలకు ఎక్కించిన ధాన్యం.. రైస్ మిల్లులకు వెళ్ళేదాకా రైతులను బాధ్యుల్ని చెయ్యొద్దని సూచించారు. ధాన్యం సేకరణకు రాష్ర్ట వ్యా ప్తంగా 8,342 ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు జీఎం నాగేశ్వర్ వివరించారు.