29-10-2025 12:02:06 AM
వాటితో ఆసుపత్రికి పరికరాలు అందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
హుస్నాబాద్, అక్టోబర్ 28 : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొ రవతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధుల కింద రూ.1.50 కోట్ల విలువైన అధునాతన వైద్య పరికరాలు మంజూరయ్యాయి. ఈ పరికరాలు ఆసుపత్రిలో ఏర్పాటు అవుతున్న సందర్భంగా, స్థానిక బీజేపీ నాయకులు కేంద్రమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
హుస్నాబాద్ పట్టణ బీజేపీ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం, గతంలో వారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ను కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి అత్యాధునిక వైద్య పరికరాలు మంజూరు చేయాలని కోరారు. దీనికి స్పందించిన మంత్రి, సుమారు రూ.1.50 కోట్ల విలువైన వైద్య పరికరాలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఎస్‌ఆర్) ద్వారా మంజూరు చేయించారు.
ఈ పరికరాలన్నీ ఆయా రూములలో అమర్చే పనులు జరుగుతున్నాయని, వారం రోజులలో ఇవి పూర్తిగా అందుబాటులోకి వస్తాయని బీజేపీ నాయకులు తెలిపారు. అవి అందుబాటులోకి రావడం వలన హుస్నాబాద్ ప్రాంతంలోని పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.