08-08-2025 06:37:55 PM
గాంధారి (విజయక్రాంతి): పండుగ పూట సైబర్ నేరగాళ్లు రాఖీ గిఫ్ట్ పేరుతో మొబైల్ ఫోన్లకు లింకులు పంపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఈ ఫేక్ లింకుల పట్ల గాంధారి మండలంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని గాంధారి ఎస్సై ఆంజనేయులు(SI Anjaneyulu) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో అపరిచితుల వ్యక్తుల నుండి వస్తున్నటువంటి లింకులను, ఇదే కాకుండా బ్యాంకుల నుండి వస్తున్నటువంటి ఫేక్ పిడిఎఫ్ లను, ఉద్యోగాల పేరిట వస్తున్నటువంటి లింకులను కూడా ఎవరు కూడా ఓపెన్ చేయకూడదని ఆయన సూచించారు. మండలంలోని స్మార్ట్ ఫోన్ వాడేటువంటి ప్రజలందరూ ఈ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండి మోసాలకు గురి కాకుండా జాగ్రత్త పడాలని ఆయన సూచించారు ఒకవేళ పొరపాటున మోసాలకు గురి అయినట్లయితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్సై సూచించారు.