08-08-2025 06:34:45 PM
గాంధారి (విజయక్రాంతి): మండల రైతులు వరి పంటకు వచ్చే అన్ని రకాల తెగుళ్ల పట్ల అప్రమంతంగా ఉండి తగిన మోతాదులో సంబంధిత మందులను ఇత్కారి చేసినట్లయితే నష్టాలను తగ్గించుకోవచ్చని గాంధారి మండల వ్యవసాయ అధికారి రాజలింగం(Mandal Agriculture Officer Rajalingam) అన్నారు. ఈ మేరకు శుక్రవారం రోజున గాంధారి మండలంలోని పోతంగల్ కాలాన్ క్లస్టర్ లోని రాంపూర్ గడ్డ గ్రామంలో రైతుల యొక్క వరి పంట పొలాలను సందర్శించి రైతులకు తగు సూచనలు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా శుక్రవారం రోజున పొతంగల్ కలాన్ క్లస్టర్‌లోని రాంపూర్ గడ్డ గ్రామంలోని వరి పొలాలను ఏఈవోతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల యొక్క వరి పంటలలో స్టెంబోర్ నష్టాన్ని గమనించడం జరిగిందని దీని నివారణకు ఎకరాకు లంబాసైహలోథ్రిన్ 2.5 ఈసీ 200 మిల్లీలీటర్లు లేదా క్లోరాంత్రానిల్‌ప్రోల్ 80 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో పిచికారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ, రైతులు తదితరులు పాల్గొన్నారు.